రచన : స్వర్గీయ వేటూరి సుందరరామ మూర్తి గారు
సంగీతం : ఎం రాధాకృష్ణ
చిత్రం : గోదావరి
పల్లవి :
షడ్యమాం భవతి వేదం
పంచమాం భవతి వేదం
శృతి శిఖరె నిగమఝరే స్వరలహరే
సా స పా ప ప ప
ప మ రి స స ని స
సా స పా ప ప ప
ప మ ద ప ప
సా స పా ప ప ప
ప మ రి స స ని స
సా స పా ప ప ప
ప మ ని ద ప
ఉప్పొంగెలే గోదావరి ఊగిందిలే చేలో వరి
భుదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి
వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి
శబరి కలిసిన గోదారి రామ చరితకే పూదారి
ఏసై చాప దోసేయ్ నావ బార్సై వాలుగా
చుక్కానె చూపుగ బ్రతుకు తెరువు ఎదురీదేగా
చరణం1 :
సావాసాలు సంసారాలు చిలిపి చిలక జోస్యం
వేసే అట్లు వేయంగానే లాభ సాటి బేరం
ఇల్లే ఓడలైపోతున్న ఇంటి పనుల దృశ్యం
ఆరేసేటి అందాలన్నీ అడిగే నీటి లగ్గం
ఏం తగ్గింది మా రామయ్య భోగం ఇక్కడా
నది ఊరేగింపులో పడవ మీద లాగ కబురు తాను కాగ
చరణం2 :
గోదారమ్మ కుంకంబొట్టు దిద్దే మిరప ఎరుపు
లంకానాథుడింకా ఆగనంటు పండు కొరుకు
చూసే చూపు ఏం చెప్పింది సీత కాంతకు
సందేహాల మబ్బే పట్టే చూసే కంటికి
లోకం కాని లోకంలోన ఎకాంతాల వలపు
అల పాపికొండల నలుపు కడగలేక నవ్వు తనకు రాగ