సంగీతం : కె వి మహాదేవన్
చిత్రం : అసెంబ్లీ రౌడీ
రచన : రస రాజు
పల్లవి :
అతడు :
అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలె
మల్లెపూల పందిరిలోకి నడచి రావే సరిగమలా
మనసునిండా మరులు పండా పసిడి పల్లకి ఎక్కాలా
రాగాలే ఊగాల శివరంజనవ్వాల
గరిసదస గరిసదస గరిసదస
ఆమె :
చల్లనైన వేకువలోన సంకురాతిరి వెలుగువలే
ముద్దబంతి ముగ్గులలోకి సాగిరారా మగసిరిలా
కనుల నిండా కలలు పండా పూలపడవా నడపాలీ
అందాలే చిందాలి అపరంజి నవ్వాలి
గరిసదస గరిసదస గరిసదస
చరణం1 :
అ : నురుగు తరగల గోదారై వలపు మిలమిల మెరవాలా
ఆ : ఒంపుసొంపుల సెలయేరై వయసు గలగల నవ్వాలా
అ : కొమ్మమీద కోకిలనై కొత్త రాగం పలకాలా
ఆ : గుడికి నేనూ దీపమునై కోటి వెలుగులు కురియాలా
అ : కంటి పాపనై కాలి అందెనై కాలమంత కరగబోసి కాపు వుండనా
సరిగ రిగప గపద పదస
గరిసదస గరిసదస గరిసదస
చరణం2 :
ఆ : ఇంద్రధనుసూ విరిసింది ఏడడుగులు నడవాలా
అ : సందెచుక్కా నిలిచింది బుగ్గచుక్కా పెట్టాలా
ఆ : ఈడుజోడు ఎలుగెత్తి ఏరువాక పాడాల
అ : తోడునీడ ఇరువురమై గూటికందం తేవాలా
ఆ : తీగమల్లెనై తెనేజల్లునై కోరికంత కూడబెట్టి కొలువు సేయనా
సరిగ రిగప గపద పదస
గరిసదస గరిసదస గరిసదస