Tuesday, July 20, 2010

సిరిమల్లె పూవల్లె నవ్వు

గానం : ఎస్ పి బాలు,ఎస్ జానకి
రచన : ఆచార్య ఆత్రేయ
సంగీతం : చక్రవర్తి
చిత్రం : జ్యోతి

పల్లవి :
సిరిమల్లె పూవల్లె నవ్వు చిన్నారి పాపల్లె నవ్వు
చిరకాలముండాలి నీ నవ్వు చిగురిస్తూ ఉండాలి
నా నువ్వు నా నువ్వు

చరణం1 :
చిరుగాలి తరగల్లె మెలమెల్లగా
సెలయేటి నురగల్లె తెలతెల్లగా ||2||
చిననాటి కలలల్లె తియతియ్యగా
ఎన్నెన్నో రాగాలు రవళించగా రవళించగా

చరణం2 :
నీ పెదవిపై నవ్వులే కెంపుగా ఆ ..
నీ కనులలో నవ్వు తెలిమెరుపుగా ఆ ..
చెక్కిళ్ళపై నవ్వు నునుసిగ్గుగా ||2||
పరువాన్ని ఉడికించి ఉరికించగా ఉరికించగా

చరణం3 :
నీ నవ్వు నా బ్రతుకు వెలిగించగా
ఆ వెలుగులో నేను పయనించగా
వెలుగుతూ వుంటాను నీ దివ్వెగా ||2||
నే మిగిలి ఉంటాను తొలినవ్వుగా తొలినవ్వుగా

సరదాగా ఈ సమయం

గానం : ఉన్నికృష్ణన్,చిత్ర
రచన : వనమాలి
సంగీతం : సామ్ ప్రసన్
చిత్రం : వినాయకుడు

పల్లవి :
సరదాగా ఈ సమయం చేసేనా మనతో పయనం
నీ జతలో ఈ నిశిలో నా అడుగే ఏ దిశలో
తెలిసేనా చివరికైనా చెలిమేదో చేరువౌనా

చరణం1 :
ఓ దూరమా ఇది నీ వైనమా దోబూచులే ఇక చాలించుమా
చూశావటే ఓ పంతమా నీవల్లనే ఈ బంధమా
ఈ నిమిషం తనతో పయనం అనుకోని చిత్రమేనా

చరణం2 :
నాతో తను నడిచే హాయిలో ఆపేదెలా నిను ఓ కాలమా
ఈ సంబరం నా సొంతమా చేజారకే ఓ స్వప్నమా
నా ఉదయం పిలిచేలోగా ఈ స్నేహం ముడిపడేనా