Wednesday, August 11, 2010

ముద్దబంతి నవ్వులో మూగ బాసలు

చిత్రం : అల్లుడుగారు
రచన : గురుచరణ్
సంగీతం : కె వి మహాదేవన్
గానం : కె జె ఏసుదాస్ , చిత్ర

పల్లవి :
ముద్దబంతి నవ్వులో మూగబాసలు
మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు
చదువుకొనే మనసుంటే ఓ కోయిలా
మధుమసమే అవుతుంది అన్నివేళలా

చరణం1 :
బంధమంటు ఎరుగని బాటసారికి
అనుబంధమై వచ్చింది ఒక దేవత
ఇంత చోటులోనే అంత మనసు ఉంచి
నా సొంతమే అయింది ప్రియురాలిగా

చరణం2 :
అందమైన తొలిరేయి స్వాగతానికి
మౌనగీతమై వచ్చింది పెళ్ళికూతురు
ఆ : ఎదుటనైన పడలేని గడ్డిపువ్వును
గుడిలోనికి రమ్మంది ఈ దైవము
మాటనోచుకొని పేదరాలిని
నీ గుండెలో నిలిపావు గృహలక్ష్మిగా

తెలుగులో రచించిన మొదటి పాట

చిత్రం : భక్త ప్రహ్లాద

రచన : చందాల కేశవదాసు

వింతాయెన్ వినన్ సంతస మాయెనుగా దేవేంద్ర

సంతస మాయెనుగా సురనాథ

అడగెను దేవారి బెడిదపు దపమున

గూరివడి ప్రాణం బెడబాసి

మనసున నానందంబును మిగులుగా

నీవొంద దనుజుండు మృతిజెందె !