చిత్రం : శ్రీరామ రాజ్యం
సంగీతం : ఇలయరాజ
గానం : చిత్ర,శ్రేయగోషల్
రచయిత : జొన్నవిత్తుల
దేవుల్లే మెచ్చింది మీముందే జరిగింది వేదంలా నిలిచింది సీత రామ కథ వినుడి ఇక వినుడి ఆ మహిమే ఇక కనుడి
మీకోసం రాసింది మీమంచి కోరింది మీముందుకొచ్చింది సీతరామకథ వినుడి ఇక వినుడి ఆ మహిమే ఇక కనుడి
ఇంటింట సుఖశాంతి వసగేనిది మనసంత వెలిగించి నిలెపేనిది సరిదారిని జనులందరి నడిపే కథ ఇది
దేవుల్లే మెచ్చింది మీముందే జరిగింది వేదంలా నిలిచింది సీత రామ కథ వినుడి ఇక వినుడి ఆ మహిమే ఇక కనుడి
అయోధ్యనేలె దశరథ రాజు అతని కులసతులు గుణవతులు మువ్వురు పుత్ర కామ యాగం చేసెను రాజే రాణులు కౌసల్య సుమిత్ర కైకలతో కలిగిరి వారికి శ్రీ వర పుత్రులు రామ లక్ష్మణ భరత శత్రుగ్నులు నలుగురు రఘు వంశమే వెలిగే ఇలా ముదముందిరి జనులె
దేవుల్లే మెచ్చింది మీముందే జరిగింది వేదంలా నిలిచింది సీత రామ కథ వినుడి ఇక వినుడి ఆ మహిమే ఇక కనుడి
దశరథ భూపతి పసి రాముని ప్రేమలో కాలమే మరిచెను కౌషికుడేతించెను తన యాగము కాపాడగ రాముని పంపాలని మహిమాన్విత అస్త్రాలను అపదేసము చేసె రాముడే ధీరుడై తాటకినే చంపె యాగమే సఫలమై కౌషిక ముని పొంగె జయరాముని గుణరాముని మిథులాపురమేగె
శివధనువదిగో నవవధువిదిగో రఘురాముని తేజం అభయం అవిగదిగో సుందర వదనం చూసిన మధురం నగుమోమున వెలిగె విజయం అదిగదిగొ ధనువును లేపి మోహన రూపం పెలపెల ద్వనిలో ప్రేమకి రూపం పూమాలై కదిలె ఆ స్వయంవర వధువె
నీనీడగ సాగునింక జానకీఅని సీతనొసగే జనకుడు శ్రీరామమూర్తికే ఆ స్పర్షకి ఆలపించే అమృతరాగమే రామంకితమై హృదయం కలిగె సీతకె శ్రీకరం మనోహరం ఇది వీడని ప్రియ బంధమని ఆజానుబాహుని జతకూడియవనిజాత ఆనందరాగమె తానగ్రునిచె సీత
దేవుల్లే మెచ్చింది మీముందే జరిగింది వేదంలా నిలిచింది సీత రామ కథ వినుడి ఇక వినుడి ఆ మహిమే ఇక కనుడి