Sunday, July 4, 2010

మొన్న కనిపించావు మైమరచిపోయాను

సంగీతం : హేరిస్ జయరాజ్
చిత్రం : సూర్య సన్నాఫ్ కృష్ణన్

పల్లవి :
మొన్న కనిపించావు మైమరచిపోయాను
అందాలతో నన్ను తూట్లు పొడిచేశావే
ఎన్నెన్నినాల్లైన నీజాడ పొడలేక
ఎందెందువెతికానో కాలమే వృధా ఆయెనే
పరువాల నీవెన్నెల కనలేని నావేదన

ఈ పొద్దే నా తోడు వచ్చేయిలా
ఊరంతా చూసేలా అవుదాం జత ||2|| ||2||

చరణం1 :
త్రాసులో నిన్నేపెట్టి తూకానికి పుత్తడిపెడితే
తులాభారం తూగేది ప్రేయసికే
ముఖం చూసి పలికేవేళ తనే ప్రేమ చూసినవేమి
హత్తుకోకపోతానా అందగాడా
నీడవోలె వెంబడివుంటా తోడుగా చెలి
పొగవోలె పరుగున వస్తా తాకనే చెలి
వేడుకలు కలలు నూరు వింతవూ చెలి

చరణం2 :
కడలినేల పొంగే అందం అలలు వచ్చి తాకే తీరం
మనసు జిల్లుమంటో౦దీ ఈ వేళలో
తలవాల్చి ఎడమిచ్చావే వేళ్ళు వేళ్ళు కలిపేశావే
పెదవికి పెదవే దూరమెందుకే
పగటికలలు కన్నా నిన్ను కునుకులేకనే
హృదయమంత నిన్నే కన్నా దరికిరాకనే
నువ్వులేక నాకు లేదు లోకమన్నది

No comments:

Post a Comment