Sunday, July 4, 2010

ఓ భూమాత ఓ భూమాత

గానం : రీట
సంగీతం : మణిశర్మ
చిత్రం : శుభప్రదం

పల్లవి :
ఓ భూమాత ఓ భూమాత

ఓరిమి చాలమ్మ ఓ భూమాత ||2||
భరించవద్దమ్మా ఇక పాపాత్ముల మోత ఓ భూమాత ||2||

చరణం1 :
మనిషిని మహర్షిగా మలచే మహితాశయ విద్యాలయం
మదించి తిరిగే మహిషాసురులకు నిలయమైతే అది విలయం
భద్రకాళిగా నిద్రలేవగా శత్రులకేలిని చిద్రముచేయగ భ్రమిదవర్ధినిగా
తాండవించగా తరుణమిదే కనుక

చరణం2 :
ఓం నమః శివాయ ఓం నమః శివాయ అని మొదలైనది పసితనం
ఏ విషమ క్షణంలో పశుగణమైనది యవ్వనం

వికృతక్రీడల వింత వినోదం రక్కసి కేకల రణం నినాదం ||2||
మెదడుకు చెడబట్టిన ఉన్మాదం ఏ బడి నేర్పినది ఈ పాటం

ఏం చేస్తున్నది యువత ఏం చూస్తున్నది మానవత ||2||

చరణం3 :
కన్నది తామేనా ఈ కౌరవసంతతిని
తమ పెంపకమేనా ఈ అరాచకత్వమనీ
సత్యం చూడని అంధుడైతే ప్రతి తండ్రి
ప్రశ్నించని గాంధారి ఐతే ప్రతి తల్లి
ఎవ్వరు నడపాలి ఈనాటి యువతరాన్ని
ఎవ్వరు ఆపాలి కిర్రెక్కిన కుర్రతనాన్ని

ఏం రాస్తున్నది ఈ చరిత ఏం కానున్నది మన భవిత

No comments:

Post a Comment