తెలుగు భాష మన సంస్కృతికి ప్రతిరూపం!

తెలుగు భాష మన సంస్కృతికి ప్రతిరూపం! మన జీవన సౌందర్యం! తేనె కన్నా తీయనిది తెలుగు! తల్లి తర్వాత తల్లి లాంటిది మన మాతృభాష! మన భావాలకు, అనుభూతులకు భావోద్వేగాలకు వాహిక తెలుగు భాష! శబ్ద సౌందర్యం, అక్షర సౌష్టవం తెలుగు ప్రత్యేకత! ఇంత చక్కని మన మాతృభాషను కాపాడుకోవడం, సజీవంగా ఉంచుకోవడం, నిత్య నూతనంగా మలచుకోవడం బిడ్డలుగా మన కర్తవ్యం! నిత్య జీవితంలోనూ తెలుగు వాడకం పెరగాలనే ఆశయంతో, ప్రతి ఒక్కరూ కచ్చితంగా తెలుగు మాట్లాడాలి అనే సదుద్దేశంతో ఈ “తెలుగు వెలుగు "ను మొదలుపెట్టడం జరిగింది. ఆంగ్ల భాష నేర్చుకొనడం లో ఏ తప్పూ లేదు, ఇంకా అది ఎంతో అవసరం కూడా, కానీ దాని కోసం మన మాతృభాషను తక్కువ చేసుకోనవసరము లేదు కదా? మీరు చెప్పండి, ఏమంటారు? రండి, తెలుగు భాష ప్రేమికులందరికీ ఇదే మా ఆహ్వానం..! " తెలుగు " ను కొత్త " వెలుగు " లో ప్రపంచానికి చూపిద్దాం!

Saturday, June 12, 2010

ఏ చీకటి చేరని

గానం : ఎం ఎం కీరవాణి
సంగీతం : ఎం ఎం కీరవాణి
రచయిత :
ఎం ఎం కీరవాణి

ఏ చీకటి చేరని కొత్తనే బ్రతుకులో ఓ రేపని వుందని తెలుసుకో
నీ ఒక నాటి మిత్రుని గుర్తు పడతావ గుర్తు పడతావా

కలలా నిజాలా కనులు చెప్పే కథలు
మరల మనుషులా ఉన్న కొన్నాళ్ళు
ఏ మన్నులో ఏ గాలిని ఊదాలనె ఊహెవరిదో
తెలుసుకోగలమా తెలుసుకోగలమా

ఏ చీకటి చేరని కొత్తనే బ్రతుకులో

now or never now or never

గానం : రంజిత్,దీపు,గీత మాధురి,చైత్ర
సంగీతం : ఎం ఎం కీరవాణి

పద పద పద పద పద పద నిను నువ్వు తరుముతు పద
పద పద పద పద పద పద నిను నువ్వు తరుముతు పద
ఇప్పుడు కాకుంటే ఎపుడు కానట్టే
ఇక్కడ నేనుంటే ఉన్నా లేనట్టే
now or never now or never now or never now or never

నిండునూ రేళ్ళ పాటు నిండు నూరేళ్ళ పాటు ప్రతి రోజు ఏదో లోటు అదే మదిలో రేపుకి చోటు
నిండు నూరేళ్ళ పాటు ప్రతి రోజు ఏదో లోటు ఆ లోటే లేకుంటె మదిలో రేపటికేది చోటు
ఇది సరిపోదంటూ ఏదో సాధించాలంటూ
వెనక లేని మరునాటిని నేడే కలల కళ్ళతో చూస్తూ
now or never పద పద పద పద పద పద
now or never నిను నువ్వు తరుముతు పద
now or never పద పద పద పద పద పద నిను నువ్వు తరుముతు పద
పద పద పద పద పద పద నిను నువ్వు తరుముతు పద

నీతోనూ కలరిస్తూ నిత్యం నిను నువ్వే గెలిపిస్తూ
సమరంఫై చిరకాలం చెరగని సంతకాన్ని పెట్టు
నువ్వు ఆగిన చూటే కాలం ఆగుతుంది అంటూ
లోకం చదివే నీ కథకిపుడే శ్రీకారం చుట్టు

now or never పద పద పద పద పద పద
now or never నిను నువ్వు తరుముతు పద
now or never పద పద పద పద పద పద నిను నువ్వు తరుముతు పద
పద పద పద పద పద పద నిను నువ్వు తరుముతు పద

మళ్ళి పుట్టని నాలో మనిషిని

గానం : ఎం ఎం కీరవాణి
సంగీతం : ఎం ఎం కీరవాణి

ఉప్పొంగిన సంద్రంలా ఉవెత్తున ఎగిసింది మనసును తడపాలని ఆశ
కొడిగట్టే దీపంలా మినుకు మినుకుమంటోంది మనిషిగ బ్రతకాలనే ఆశ
గుండెల్లో ఊపిరై కళ్ళల్లో జీవమై ప్రాణంలో ప్రాణమై
మళ్లి పుట్టని నాలో మనిషిని
మళ్లి పుట్టని నాలో మనిషిని


రూపాయి

గానం : ఎం ఎం కీరవాణి
సంగీతం : ఎం ఎం కీరవాణి
చిత్రం : వేదం


ఇది చేతులు మారి రాతలు మార్చే కాగితమోయ్
తన జేబుల నుంచి జేబులలోకి దూకేసి ఎగిరే ఎగిరే
రూపాయి రు రూపాయి ఇది రూపాయి హే రూపాయి
రుప్పి రుప్పి రుపి రూపాయి
రుప్పి రుప్పి రుపి రూపాయి
కోటలు మేడలు కట్టాలన్న కాటికి నలుగురు మోయాలన్న
గుప్పెడు మెతుకులు పుట్టాలన్న ప్రాణం తీయాలన్న ఒకటే రూపాయి

ఈ ఊసరవిల్లికి రంగులు రెండే బ్లాకు అండ్ వైట్
ఈ కాసుల తల్లిని కొలిచే వాడి రాంగ్ ఇస్ రైట్
తన హుండీ నిండాలంటే దేవుడికైన మరి అవసరమేనోయ్
రూపాయి రు రూపాయి ఇది రూపాయి హే రూపాయి
రుప్పి రుప్పి రుపి రూపాయి
రుప్పి రుప్పి రుపి రూపాయి
పోయే ఊపిరి నిలవాలన్న పోరాటంలో గెలవాలన్న
జీవన చక్రం తిరగాలన్న జననం నుంచి మరణం దాక రూపాయి

ఏమి తెలిసి నను మోహిస్తివి

గానం : పద్మ,పూర్ణిమ,మంజు
సంగీతం : ఎం ఎం కీరవాణి

ఏమి తెలిసి నను మోహిస్తివి
దేహమేలాంటిదని నీవాలోచిస్తివి
అచ్చమైన తోలు తిత్తి
అందున గుమ్మాలు తొమ్మిది
హేయమైన ఘటము కాయము
ఆయువైన క్షణము మాయము
ఏ ఫలము వుందని ఇందు చేరితివి
నిజ మర్మమెరుగక నీలవేణి పొందు కోరితివి