తెలుగు భాష మన సంస్కృతికి ప్రతిరూపం!

తెలుగు భాష మన సంస్కృతికి ప్రతిరూపం! మన జీవన సౌందర్యం! తేనె కన్నా తీయనిది తెలుగు! తల్లి తర్వాత తల్లి లాంటిది మన మాతృభాష! మన భావాలకు, అనుభూతులకు భావోద్వేగాలకు వాహిక తెలుగు భాష! శబ్ద సౌందర్యం, అక్షర సౌష్టవం తెలుగు ప్రత్యేకత! ఇంత చక్కని మన మాతృభాషను కాపాడుకోవడం, సజీవంగా ఉంచుకోవడం, నిత్య నూతనంగా మలచుకోవడం బిడ్డలుగా మన కర్తవ్యం! నిత్య జీవితంలోనూ తెలుగు వాడకం పెరగాలనే ఆశయంతో, ప్రతి ఒక్కరూ కచ్చితంగా తెలుగు మాట్లాడాలి అనే సదుద్దేశంతో ఈ “తెలుగు వెలుగు "ను మొదలుపెట్టడం జరిగింది. ఆంగ్ల భాష నేర్చుకొనడం లో ఏ తప్పూ లేదు, ఇంకా అది ఎంతో అవసరం కూడా, కానీ దాని కోసం మన మాతృభాషను తక్కువ చేసుకోనవసరము లేదు కదా? మీరు చెప్పండి, ఏమంటారు? రండి, తెలుగు భాష ప్రేమికులందరికీ ఇదే మా ఆహ్వానం..! " తెలుగు " ను కొత్త " వెలుగు " లో ప్రపంచానికి చూపిద్దాం!

Monday, June 14, 2010

తెలుగు తెలుగులా తెలిసిన,రచించిన ఆఖరి రచయిత

తెలుగు రచనకు ఆఖరి రచయిత





















స్వర్గీయ వేటూరి సుందరరామ మూర్తి గారు

వేణువై వచ్చాను

గానం : చిత్ర
సంగీతం : ఎం ఎం కీరవాణి
రచన : వేటూరి సుందరరామ మూర్తి
సినిమా : మాతృదేవోభవ

పల్లవి :
వేణువై వచ్చాను భువనానికి గాలినై పోతాను గగనానికి ||2||
మమతలన్ని మౌన గానం వాంచలన్ని వాయులీనం
మాతృదేవోభవ ( మాతృదేవోభవ )
పితృదేవోభవ ( పితృదేవోభవ )
ఆచార్యదేవోభవ ( ఆచార్యదేవోభవ )

చరణం1 :
ఏడు కొండలకైన బండ తానోక్కటే ఏడు జన్మల తీపి ఈ బంధమే ||2||
నీ కంటిలో నలత లో వెలుగునే కనక నేను మీననుకుంటే యాడ చేకటే హరే హరే హరే
రాయినై వున్నాను ఈ నాటికీ రామ పాదము రాక ఏ నాటికీ

చరణం2 :
నీరు కన్నీరాయే ఊపిరే బరువాయె నిప్పు నిప్పుగా మారే నా గుండెలో ||2||
ఆ నింగిలో కలిసి ఆ శూన్యబంధాలు పుట్టిలో చేరే మట్టి ప్రాణాలు హరే హరే హరే
రెప్పనై వున్నాను నీ కంటికి పాపనై వస్తాను మీ ఇంటికి

రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే

గానం : ఎం ఎం కీరవాణి
సంగీతం : ఎం ఎం కీరవాణి
రచన : వేటూరి సుందరరామ మూర్తి
సినిమా : మాతృదేవోభవ

పల్లవి :
రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే తోటమాలి నీ తోడు లేడులే
వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే లోకమెన్నడో చీకటాయెలే
నీకిది తెలవారని రేయమ్మా కలికి మా చిలక పాడకు నిన్నటి నీ రాగం

చరణం1 :
చెదిరింది నీ గూడు గాలిగా చిలక గోరింకమ్మ గాధగా
చిన్నారి రూపాలు కన్నీటి దీపాలు కాగా
తనవాడు తారల్లో చేరగ మనసు మాంగల్యాలు జారగ
సింధూర వర్ణాలు తెల్లారి చల్లారి పోగా
తిరిగే భూమాతవు నీవై వేకువలో వెన్నెలవై
కరిగే కర్పూరం నీవై ఆశలకే హారతివై

చరణం2 :
అనుబంధమంటేనే అప్పులే కరిగే బంధాలన్నీ మబ్బులే
హేమంత రాగాల చేమంతులే వాడిపోయే
తన రంగు మార్చింది రక్తమే తనతో రాలేనంది పాశమే
దీపాల పండక్కి దీపాలే కొండెక్కిపోయే
పగిలే ఆకాశం నీవై జారిపడే జాబిలివై
మిగిలే ఆలాపన నీవై తీగ తెగే వీనియవై