సంగీతం : ఆదినారాయణరావు
రచన : సి నారాయణరెడ్డి
చిత్రం : అల్లూరి సీతారామరాజు
పల్లవి :
వస్తాడు నా రాజు ఈరోజు
రానే వస్తాడు నెలరాజు ఈరోజు
కార్తీక పున్నమి వేళలోన
కలికి వెన్నెల కెరటాలపైన
తేలి వస్తాడు నారాజు ఈరోజు
చరణం1 :
వేలతారకల నయనాలతో నీలాకాశం తిలకించేను
ఆతని చల్లని అడుగుల సవ్వడి వీచేగాలి వినిపించేను
ఆతని పావన పాదధూళికై అవని అణువణువు కలవరించేను
అతని రాకకై అంతరంగమే పాలసంద్రమై పరవశించేను
చరణం2 :
వెన్నెలలెంతగా విరిసినగానీ చంద్రుణ్ణి విడిపోలేవు
కెరటాలెంతగా పొంగినగానీ కడలిని విడిపోలేవు
కలిసిన ఆత్మల అనుబంధాలు ఏ జన్మకు విడిపోలేవులే
తనువులు వేరైనా దారులు వేరైనా ఆ బంధాలే నిలిచేనులే
No comments:
Post a Comment