తెలుగు భాష మన సంస్కృతికి ప్రతిరూపం!

తెలుగు భాష మన సంస్కృతికి ప్రతిరూపం! మన జీవన సౌందర్యం! తేనె కన్నా తీయనిది తెలుగు! తల్లి తర్వాత తల్లి లాంటిది మన మాతృభాష! మన భావాలకు, అనుభూతులకు భావోద్వేగాలకు వాహిక తెలుగు భాష! శబ్ద సౌందర్యం, అక్షర సౌష్టవం తెలుగు ప్రత్యేకత! ఇంత చక్కని మన మాతృభాషను కాపాడుకోవడం, సజీవంగా ఉంచుకోవడం, నిత్య నూతనంగా మలచుకోవడం బిడ్డలుగా మన కర్తవ్యం! నిత్య జీవితంలోనూ తెలుగు వాడకం పెరగాలనే ఆశయంతో, ప్రతి ఒక్కరూ కచ్చితంగా తెలుగు మాట్లాడాలి అనే సదుద్దేశంతో ఈ “తెలుగు వెలుగు "ను మొదలుపెట్టడం జరిగింది. ఆంగ్ల భాష నేర్చుకొనడం లో ఏ తప్పూ లేదు, ఇంకా అది ఎంతో అవసరం కూడా, కానీ దాని కోసం మన మాతృభాషను తక్కువ చేసుకోనవసరము లేదు కదా? మీరు చెప్పండి, ఏమంటారు? రండి, తెలుగు భాష ప్రేమికులందరికీ ఇదే మా ఆహ్వానం..! " తెలుగు " ను కొత్త " వెలుగు " లో ప్రపంచానికి చూపిద్దాం!

Tuesday, June 15, 2010

మురిసే పండగ పూట

గానం : మదవపెద్ది రమేష్, శేషగిరీశం
సంగీతం : ఇళయరాజ
చిత్రం : క్షత్రియపుత్రుడు

పల్లవి :
మురిసే పండగ పూటా రాజుల కథ ఈ పాటా
సాహసాల గాథకే పేరు మనదిలే హొయ్ మొక్కులందు వాడే క్షత్రియపుత్రుడే హొయ్ ||2||

చరణం1 :
కల్లాకపటమంటూలేని
డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు డోయ్
పల్లెపట్టు ఈ మాగాణి
డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు డోయ్
మల్లెవంటి మనసేవుంది మంచే మనకు తోడైవుంది
కన్నతల్లిలాంటి ఉన్న ఊరికోసం పాటుపడేనంట రాజుగారి వంశం
వీరులున్న ఈ ఊరు పౌరుషాల సెలయేరు
పలికే దైవం మా రాజు గారు

చరణం2 :
న్యాయం మనకు నీడైవుంది
డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు డోయ్
ధర్మం చూపు జాడేవుంది
డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు డోయ్
దేవున్నైన ఎదిరించేటి ధైర్యం మనది ఎదురేముంది
చిన్నోల్లింటి శుభకార్యాలు చేయించేటి ఆచారాలు
వెన్నెలంటి మనసులతోటి దీవించేటి అభిమానాలు
కలిసింది ఒక జంట కలలెన్నో కలవంట
కననీ విననీ కథ ఏదో వుందంట