తెలుగు భాష మన సంస్కృతికి ప్రతిరూపం!

తెలుగు భాష మన సంస్కృతికి ప్రతిరూపం! మన జీవన సౌందర్యం! తేనె కన్నా తీయనిది తెలుగు! తల్లి తర్వాత తల్లి లాంటిది మన మాతృభాష! మన భావాలకు, అనుభూతులకు భావోద్వేగాలకు వాహిక తెలుగు భాష! శబ్ద సౌందర్యం, అక్షర సౌష్టవం తెలుగు ప్రత్యేకత! ఇంత చక్కని మన మాతృభాషను కాపాడుకోవడం, సజీవంగా ఉంచుకోవడం, నిత్య నూతనంగా మలచుకోవడం బిడ్డలుగా మన కర్తవ్యం! నిత్య జీవితంలోనూ తెలుగు వాడకం పెరగాలనే ఆశయంతో, ప్రతి ఒక్కరూ కచ్చితంగా తెలుగు మాట్లాడాలి అనే సదుద్దేశంతో ఈ “తెలుగు వెలుగు "ను మొదలుపెట్టడం జరిగింది. ఆంగ్ల భాష నేర్చుకొనడం లో ఏ తప్పూ లేదు, ఇంకా అది ఎంతో అవసరం కూడా, కానీ దాని కోసం మన మాతృభాషను తక్కువ చేసుకోనవసరము లేదు కదా? మీరు చెప్పండి, ఏమంటారు? రండి, తెలుగు భాష ప్రేమికులందరికీ ఇదే మా ఆహ్వానం..! " తెలుగు " ను కొత్త " వెలుగు " లో ప్రపంచానికి చూపిద్దాం!

Tuesday, June 22, 2010

అందమైన మనసులో

గానం : ఉష
సంగీతం : ఆర్ పి పట్నాయక్
రచన : కులశేఖర్
చిత్రం : జయం

పల్లవి :
అందమైన మనసులో ఇంత అలజడెందుకో
ఎందుకో .. ఎందుకో .. ఎందుకో ..
తేలికైన మాటలే పెదవి దాటవెందుకో
ఎందుకో .. ఎందుకో .. ఎందుకో ..
ఎందుకో .. అసలెందుకో .. అడుగెందుకో ..
మొదటిసారి ప్రేమ కలిగినందుకా

చరణం1 :
అక్షరాలు రెండే లక్షణాలు ఎన్నో ఏమని చెప్పాలి నీతో
ఒక్కమాట ఐనా తక్కువేమి కాదే ప్రేమకు సాటేదీ లేదే
రైలు బండి కూతే సన్నాయి పాట కాగా
రెండు మనసులొకటయ్యేనా
కోయిలమ్మ పాటే మది మీటుతున్న వేళా
కాలి మువ్వ గొంతు కలిపెనా ..

చరణం2 :
ఓరనవ్వుతోనే ఓనమాలు దిద్ది ఒడిలో చేరిందా ప్రేమ
కంటిచూపుతోనే కొంటె సైగచేసి కలవర పెడుతుందా ప్రేమ
గాలిలాగ వచ్చి ఎదచేరనేమొ ప్రేమా
గాలివాటు కాదేమైనా
ఆలయాన దైవం కరుణించి పంపెనమ్మా
అందుకోవె ప్రేమ దీవెనా ..