తెలుగు భాష మన సంస్కృతికి ప్రతిరూపం!

తెలుగు భాష మన సంస్కృతికి ప్రతిరూపం! మన జీవన సౌందర్యం! తేనె కన్నా తీయనిది తెలుగు! తల్లి తర్వాత తల్లి లాంటిది మన మాతృభాష! మన భావాలకు, అనుభూతులకు భావోద్వేగాలకు వాహిక తెలుగు భాష! శబ్ద సౌందర్యం, అక్షర సౌష్టవం తెలుగు ప్రత్యేకత! ఇంత చక్కని మన మాతృభాషను కాపాడుకోవడం, సజీవంగా ఉంచుకోవడం, నిత్య నూతనంగా మలచుకోవడం బిడ్డలుగా మన కర్తవ్యం! నిత్య జీవితంలోనూ తెలుగు వాడకం పెరగాలనే ఆశయంతో, ప్రతి ఒక్కరూ కచ్చితంగా తెలుగు మాట్లాడాలి అనే సదుద్దేశంతో ఈ “తెలుగు వెలుగు "ను మొదలుపెట్టడం జరిగింది. ఆంగ్ల భాష నేర్చుకొనడం లో ఏ తప్పూ లేదు, ఇంకా అది ఎంతో అవసరం కూడా, కానీ దాని కోసం మన మాతృభాషను తక్కువ చేసుకోనవసరము లేదు కదా? మీరు చెప్పండి, ఏమంటారు? రండి, తెలుగు భాష ప్రేమికులందరికీ ఇదే మా ఆహ్వానం..! " తెలుగు " ను కొత్త " వెలుగు " లో ప్రపంచానికి చూపిద్దాం!

Friday, September 9, 2011

తెలుగు బిడ్డనంచు తెగ చెప్పుకొని నీవు

తెలుగు బిడ్డనంచు తెగ చెప్పుకొని నీవు
ఆంగ్లభాషలోన అతి ప్రయాసగ మాట్లాడి
మాతృభాష యనగ మౌనంబు వహియించి
టెలుగుభాషకు తెగులు సోకించినావు

తెలుగునాట బుట్టి తెలుగునాట పెరిగి
తెలుగు సంస్కృతియు తెలిసి నీవు
అన్యభాషలోన అతి యాసగ మాట్లాడి
తెలుగు తెలియనట్లు తెగఫొజులిస్తివి

పొరుగు రాష్త్రాలలో అతిదొడ్డ మనసుతో
మాతృభాషలోన మధురంగ మాట్లాడి
మాతృభాషామ తల్లిని బహుగ రక్షించగ
తెలుగు మాట్లాడుటకు తెగ సిగ్గుపడితివి

మాతృభాషలోన పరిపాలనను జరుప
ఉత్తర్వులెన్నియో వెడలుచున్నను గాని
మానసంబున నీకు మాతౄభాష పైన
ప్రేమ పుట్టకపోతె ఫలితమేమి ?

విఙులైనవారు విషయంబు గ్రహియించి
ఆంధ్రమాత హృదయ స్పందనను గమనించి
నిత్యజీవితాన అత్యంత ప్రేమతో
మాతృభాష తెలుగు మరువకుందురు గాక !

ఎవరనుకొన్నారీ తెలుగు వాడు .!

ఎవరనుకొన్నారీ తెలుగు వాడు .!
సృష్టికి ప్రతి సృష్టి చేసి, వసిష్టుని కెదురు ప్రశ్నేవేసిన
రాజుగా , రాజర్షిగా, బ్రహ్మర్షిగా పై కెదిగిన
అల విశ్వామిత్రునకు ఆదర్శ కుమారుడు
భరుతునికి సహజన్ముడు,
భారత సామ్రాజ్యరాజ పదవికి వారసుడు.

ఒక బ్రహ్మయై - కాల జ్ఞానం
ఒక బ్రహ్మనయై - సమాజవాదం
ఒక వేమనయై - వేదసారం
ఉర్వికి బోధించినోడు
సిద్దేంద్రుడై " కూచిపూడి " శివనాట్యం చేసినవాడు.

కాకతీయ సామ్రాజ్యం " ఘనం " ముగా పాలించినవాడు ..
విజయనగరంనందు " భువనవిజయం" సాధించినాడు

తెలుగుపాట అరువనోట పలికించిన వాడు
త్యాగయ్య.
భారత రాజ్యాంగ గీత ప్రవచించెన వాడు
అల్లాడి కృష్ణయ్య.
త్రివర్ణ పతాక రేఖలు తీర్చెన వాడు
పింగళి వెంకయ్య.

భాష స్వాతంత్రోద్యమంలో సమరాలు చెసినవాడు
గిడుగు రామమూర్తి పంతులు.

గుండెను మరాతుపాకీకి కి గురి చూపెన వాడు
టంగుటూరి వీరేశలింగం పంతులు.

విల్లమ్ములతో పిరంగి గుళ్ళనడ్డే న వాడు
అల్లూరి సీతారామరాజులు.

దేశమంటే " మనుషు "లని
జాతీయ దృక్పదాన్ని నేర్పినవాడు
గురజాడ అప్పారావు .
తెలుగు సాహిత్యయంలో మరో ప్రపంచం రచించాడు
"నేను సైతం ప్రపంచాగ్నికి సమిధ నోక్కటి.." అన్నాడు
శ్రీ శ్రీ / శ్రీరంగం శ్రీనివాసరావు

ఆరంభ శూరుడనే
అపవాదుకు గురైనోడు
అనుకున్నది కాకుంటే
అందరిపై అలుగువాడు.

ఇల్లుదాటి ఎల్లదాటి
ఎల్లజగతి తిరిగినొడు
ఏదేశమేగినా....
సొంతూరు మరువని వాడు
పాతతగువలు వదలని వాడు.

ఎవరనుకొన్నారీ తెలుగువాడు.
పరపాలన వదిలిన
పరభాషను వదలనివాడు
మా పెద్దోళ్ళు మా చిన్నోళ్ళు
మా వారసులు తెలుగు వాళ్ళు ....