తెలుగు భాష మన సంస్కృతికి ప్రతిరూపం!

తెలుగు భాష మన సంస్కృతికి ప్రతిరూపం! మన జీవన సౌందర్యం! తేనె కన్నా తీయనిది తెలుగు! తల్లి తర్వాత తల్లి లాంటిది మన మాతృభాష! మన భావాలకు, అనుభూతులకు భావోద్వేగాలకు వాహిక తెలుగు భాష! శబ్ద సౌందర్యం, అక్షర సౌష్టవం తెలుగు ప్రత్యేకత! ఇంత చక్కని మన మాతృభాషను కాపాడుకోవడం, సజీవంగా ఉంచుకోవడం, నిత్య నూతనంగా మలచుకోవడం బిడ్డలుగా మన కర్తవ్యం! నిత్య జీవితంలోనూ తెలుగు వాడకం పెరగాలనే ఆశయంతో, ప్రతి ఒక్కరూ కచ్చితంగా తెలుగు మాట్లాడాలి అనే సదుద్దేశంతో ఈ “తెలుగు వెలుగు "ను మొదలుపెట్టడం జరిగింది. ఆంగ్ల భాష నేర్చుకొనడం లో ఏ తప్పూ లేదు, ఇంకా అది ఎంతో అవసరం కూడా, కానీ దాని కోసం మన మాతృభాషను తక్కువ చేసుకోనవసరము లేదు కదా? మీరు చెప్పండి, ఏమంటారు? రండి, తెలుగు భాష ప్రేమికులందరికీ ఇదే మా ఆహ్వానం..! " తెలుగు " ను కొత్త " వెలుగు " లో ప్రపంచానికి చూపిద్దాం!

Tuesday, July 26, 2011

భక్త ప్రహ్లాద

తెలుగు మాటలు పాటలతో విడుదలైన మొదటి చిత్రం : భక్త ప్రహ్లాద

భక్త ప్రహ్లాద చిత్రంలో మొదటి పాట రచయిత : ధర్మవరం రామకృష్ణమాచార్య

తెలుగులో మొదట పాటలు రాసిన కవి :చందాల కేశవదాసు

Tuesday, July 19, 2011

తెలుసా ..నీకు తెలుసా ...

తెలుసా ..నీకు తెలుసా ... ప్రేమంటే ఒకే లాగ ఉదయించె గగనమని

తెలుసా ..
నీకు తెలుసా ...ప్రేమంటే ఒకే మనిషి నివసించే భువనమని
ఒకే మాట వినిపించే కావ్యమని .. ఒకే దివ్య వెలుగొందే కోవెలని
అదే అదే ..అదే నా హృదయమని .. ప్రణయమని ... ప్రాణమని !

తెలుసా ..
నీకు తెలుసా ...ప్రేమంటే ఒకే మనిషి నివసించే భువనమని
ఒకే మురళి పలికే గోకులమని .. ఒకే కెరటము పొంగే యమున అని
అదే అదే నా జీవమని .. గానమని .. మౌనమని ... తెలుసా !


సీతగాలి వీచినప్పుడు లేత ఎండలా
ఎండకన్ను సోకినప్పుడా మంచు కొండలా
ఆదుకొనే వెచ్చని మమత
ఆవిరయ్యే చల్లని ఎడద
ఒకటే శృతి ..ఒకటే లయ.. ఒకటే స్వరము
ఆ.. ఆ .. ఆ ..
మౌన రాగమొకటే అదే .. అదే.. అనురాగమని
మౌనయోగమని .. ప్రేమదీపమని .. తెలుసా .. నీకు తెలుసా ...!!!


శరత్ కాల నదులలోని తేట నీటిలా
పుష్య మాస సుమగళాల తేనెవాసలా
సుప్రసన్న సుందర కవిత
సుప్రభాత మరంద గుళిక
ఒక పార్వతి .. ఒక శ్రీపతి .. ఒక సరస్వతి
" సర్వ మంగళ మాన్గాల్యే శివే సర్వార్దాసారకే
శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణి నమోస్తుతే "
ఉన్న మంత్రమొకటే .. అదే ..అదే .. మమకారము
సృష్టి కారణం ... బ్రహ్మకు జననం ..తెలుసా ..నీకు తెలుసా ...!!!