తెలుగు భాష మన సంస్కృతికి ప్రతిరూపం!

తెలుగు భాష మన సంస్కృతికి ప్రతిరూపం! మన జీవన సౌందర్యం! తేనె కన్నా తీయనిది తెలుగు! తల్లి తర్వాత తల్లి లాంటిది మన మాతృభాష! మన భావాలకు, అనుభూతులకు భావోద్వేగాలకు వాహిక తెలుగు భాష! శబ్ద సౌందర్యం, అక్షర సౌష్టవం తెలుగు ప్రత్యేకత! ఇంత చక్కని మన మాతృభాషను కాపాడుకోవడం, సజీవంగా ఉంచుకోవడం, నిత్య నూతనంగా మలచుకోవడం బిడ్డలుగా మన కర్తవ్యం! నిత్య జీవితంలోనూ తెలుగు వాడకం పెరగాలనే ఆశయంతో, ప్రతి ఒక్కరూ కచ్చితంగా తెలుగు మాట్లాడాలి అనే సదుద్దేశంతో ఈ “తెలుగు వెలుగు "ను మొదలుపెట్టడం జరిగింది. ఆంగ్ల భాష నేర్చుకొనడం లో ఏ తప్పూ లేదు, ఇంకా అది ఎంతో అవసరం కూడా, కానీ దాని కోసం మన మాతృభాషను తక్కువ చేసుకోనవసరము లేదు కదా? మీరు చెప్పండి, ఏమంటారు? రండి, తెలుగు భాష ప్రేమికులందరికీ ఇదే మా ఆహ్వానం..! " తెలుగు " ను కొత్త " వెలుగు " లో ప్రపంచానికి చూపిద్దాం!

Saturday, August 20, 2011

గాలి నింగి నీరు

చిత్రం : శ్రీరామ రాజ్యం
సంగీతం : ఇలయరాజ
గానం : S P బాలసుబ్రమణ్యం
రచయిత : జొన్నవిత్తుల

గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామా వద్ధనలేర ఒకరూ
నేరం చేసిందెవరు దూరం అవుతోందెవరు ఘోరం ఆపేదెవరు ఎవరూ

రారె మునులు ఋషులు ఏమైరి వేదాంతులు సాగె ఈ మౌనం సరేనా?
కొండ కోన అడవి సెలయేరు సరయూ నది అడగండి న్యాయం ఇదేనా?

గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామా వద్ధనలేర ఒకరూ

ముక్కోటి దేవతలంత దీవించిన ఈ బంధం ఇక్కడ ఇప్పుడు విడుతుంటె ఏ ఒక్కడు కూడా దిగిరార ?
అందరికీ ఆదర్శం అని కీర్తించె ఈ లోకం రాముని కోరగ పొలేద ఈ రధముని ఆపగలేద?
విధినైన కాని ఎదిరించేవాడె విధి లేక నేడు విలపించినాడె
ఏడేడు లోకాలకి సోకేను ఈ శోకం

గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామా వద్ధనలేర ఒకరూ

అక్కడితో అయిపోకుండ ఇక్కడ ఆ ఇల్లాలె రక్కసివిధి కి చిక్కింద? ఈ లెక్కన దైవం ఉందా?
సుగునంతొ సుర్యుని వంశం వెలిగించె కులసతిని ఆ వెలుగే వెలివేసింద? ఈ జగమే చీకటి అయ్యిందా?
ఏ తప్పు లేని ఈ ముప్పు ఏమి కాపాడలేర? ఎవరైన కాని..
నీమాటె నీద వేరే దారేది లేద

నేరం చేసిందెవరు దూరం అవుతోందెవరు ఘోరం ఆపెదెవరు ఎవరూ

రారె మునులు ఋషులు ఏమైరి వేదాంతులు సాగె ఈ మౌనం సరేనా?
కొండ కోన అడవి సెలయేరు సరయూ నది అడగండి న్యాయం ఇదేనా?

గాలి నింగి నీరు భూమి నిప్పు మీరు రామా వద్ధనలేర ఒక్కరూ




No comments:

Post a Comment